మరిన్ని సడలింపులు ఇచ్చిన జగన్ సర్కార్.. బట్ కండీషన్స్ అప్లయ్

By Siva KodatiFirst Published May 26, 2020, 3:16 PM IST
Highlights

లాక్‌డౌన్ 4కు ముగింపుకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల షాపులతో పాటు స్ట్రీట్ ఫుడ్స్‌ తెరిచేందుకు అనుమతించింది.

లాక్‌డౌన్ 4కు ముగింపుకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. నగలు, బట్టలు, చెప్పుల షాపులతో పాటు స్ట్రీట్ ఫుడ్స్‌ తెరిచేందుకు అనుమతించింది.

పెద్ద పెద్ద షోరూంలకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో అనుమతి తప్పనిసరని నిబంధన విధించింది. అయితే వస్త్ర దుకాణాల్లో ట్రయల్‌‌ను నిషేధించింది. పానీపూరి బండ్లకు మాత్రం సర్కార్ అనుమతి ఇవ్వలేదు.

ఇకపై రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ రూంలో కాకుండా పార్శిల్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సర్క్యూలర్‌లో తెలిపింది. అలాగే ప్రభుత్వం వద్ద ముందుగా నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటితో పాటు నగల దుకాణదారులు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో వివరించింది. 

Also Read:

ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులకు జగన్ గ్రీన్ సిగ్నల్.. ఈ నిబంధనలు తప్పనిసరి

ఈ ఏడాది రైతులకు ఉచితంగా పంటల భీమా: సీఎం జగన్
 
click me!