ప్రభాస్ అభిమానులకు శుభవార్త : ‘‘ఆదిపురుష్’’ టికెట్ రేట్‌ పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి, ఎంతంటే..?

Siva Kodati |  
Published : Jun 14, 2023, 06:16 PM ISTUpdated : Jun 14, 2023, 06:19 PM IST
ప్రభాస్ అభిమానులకు శుభవార్త  : ‘‘ఆదిపురుష్’’ టికెట్ రేట్‌ పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి, ఎంతంటే..?

సారాంశం

ప్రభాస్ , కృతి సనన్ నటించిన ఆదిపురుష్ మూవీ టికెట్ ధర పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. టికెట్ పై రూ.50 పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా నటించిన ‘ఆదిపురుష్’’ సినిమా టికెట్ ధర పెంపునకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ సినిమా టికెట్ ధరను రూ.50 మేర పెంచుకోవచ్చని రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ సినిమా ఆరో ఆట ప్రదర్శనకు కూడా కేసీఆర్ సర్కార్ అనుమతించింది. 

ఇకపోతే.. గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సీతగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించగా.. ఇతర పాత్రల్లో స్టార్ కాస్ట్ సందడి చేయబోతోంది.  ఈసినిమాలో ప్రత్యేకతలెన్నో.. మొట్టమొదటి సారి  ఈసినిమా కోసం.. ప్రీరిలీజ్ వేడుకకు జీయర్ స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈమూవీలో ప్రభాస్ మొదటి సారి రాముడిగా కనిపించబోతున్నారు. 

ALso Read: ప్రభాస్ అభిమానులకు శుభవార్త ... ‘‘ఆదిపురుష్’’ ఆరో ఆటకు తెలంగాణ సర్కార్ అనుమతి

భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు