సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు.. పూనం మాలకొండయ్య చేతికి పది డిపార్ట్‌మెంట్స్‌

Siva Kodati |  
Published : Dec 07, 2022, 05:17 PM IST
సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు.. పూనం మాలకొండయ్య చేతికి పది డిపార్ట్‌మెంట్స్‌

సారాంశం

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం గత మంగళవారం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎంవో కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఐఏఎస్‌లకు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. 

ఇటీవల సీఎంవో అధికారులుగా బదిలీపై వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. దీనిలో భాగంగా పూనం మాలకొండయ్యకు అత్యధికంగా 10 శాఖలు దక్కడం విశేషం. తర్వాత ధనుంజయ రెడ్డి , ముత్యాలరాజులకి ఏడేసి శాఖలు, నారాయణ్ భరత్ గుప్తాకు 6 శాఖల్ని కేటాయించారు. జవహర్ రెడ్డి, ఆరోగ్య రాజ్‌లు సీఎంవో నుంచి బయటికి వెళ్లడంతో కొత్తగా కేటాయింపులు చేశారు. 

కాగా... రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం గత మంగళవారం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్యకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సెలవుపై ఉన్న బుడితి రాజశేఖర్‌ను.. తిరిగివచ్చిన తర్వాత జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 

ALso REad:ముగిసిన పదవీ కాలం : సమీర్ శర్మను వదలని జగన్.. ఏకంగా సీఎంవోలో కొత్త పోస్ట్, విజయ్ కుమార్‌కు కూడా

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అయితే పరిపాలనలో ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావించిన సీఎం వైఎస్ జగన్.. సమీర్ శర్మ కోసం కొత్త పదవినే సృష్టించారు. పదవీ విరమణ తర్వాత సమీర్ శర్మను ఎక్స్‌ అఫీషియో చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ హోదాలో ఆయన సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

సమీర్ శర్మతో పాటు పదవీ విరమణ చేసిన మరో సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ కోసం కూడా జగన్ ప్రభుత్వం కొత్త పోస్ట్‌ను సృష్టించింది. స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఆయనను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికా సంఘం ఎక్స్ అఫీషియో సెక్రటరీ హోదాలో విజయ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్