AP PRC : జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాతే.. పీఆర్సీ ప్రకటన: తేల్చిచెప్పిన సజ్జల

Siva Kodati |  
Published : Dec 16, 2021, 03:32 PM ISTUpdated : Dec 16, 2021, 03:34 PM IST
AP PRC : జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాతే.. పీఆర్సీ ప్రకటన: తేల్చిచెప్పిన సజ్జల

సారాంశం

వీలైనంత త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna Reddy) ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సీఎంతో భేటీ తర్వాతే పీఆర్సీ  ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి  వెల్లడించారు. 

వీలైనంత త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామన్నారు  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna Reddy) ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదన్న ఆయన.. కోవిడ్ ఆర్ధిక సంక్షోభం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. సీఎం జగన్‌తో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (buggana rajendranath reddy ), సీఎస్ సమీర్ శర్మ (sameer sharma), సజ్జల దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. సీఎం జగన్‌తో రేపు లేదా సోమవారం ఉద్యోగ సంఘాలు చర్చలు జరుపుతాయని ఆయన తెలిపారు. సీఎంతో భేటీ తర్వాతే పీఆర్సీ  ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి  వెల్లడించారు. 

ప్రస్తుతం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని.. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల వెల్లడించారు. సీఎస్ కమిటీ సిఫారసుతో 14.29 శాతం ఐఆర్‌ను అమలు చేస్తూ .. ఐఆర్‌కు రక్షణ వుండేలా చూస్తామని ఆయన చెప్పారు. మరోవైపు పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ, మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిలు మరోసారి భేటీకానున్నారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలతో వీరిద్దరూ సమావేశం కానున్నారు. 

Also Read:పీఆర్సీపై పీటముడి: జగన్‌తో బుగ్గన, సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ

కాగా.. ఏపీ జేఏసీ, ఏపీ జేఎసీ అమరావతి నేతలు 55 శాతం prc fitment  ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం 34 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు మానిటరీ బెనిఫిట్స్ ను వచ్చే ఏడాది అక్టోబర్ నుండి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విషయమై కూడా ఉద్యోగ సంఘాల నేతలు పట్టు వీడడం లేదు.prc విషయమై ఇప్పటికే AP Jac, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ  సంఘాలు నిరసనకు దిగాయి.

ప్రభుత్వంతో చర్చలకు నల్ల బాడ్జీలను ధరించి చర్చలకు హాజరయ్యారు. సీఎంతో జరిగే చర్చలకు కూడా తాము నల్లబాడ్జీలతో హాజరౌతామని కూడా ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. అయితే సీఎంతో చర్చల సమయంలో  నల్లబాడ్జీలు లేకుండా రావాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కోరారు. అయితే తమ ఉద్యమ కార్యాచరణను వీడేదీ లేదని ఉద్యో సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్