మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం.. అసెంబ్లీ సీట్లు పెంచితే బాగుండేది : సజ్జల రామకృష్ణారెడ్డి

Siva Kodati |  
Published : Jul 27, 2022, 09:45 PM IST
మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం.. అసెంబ్లీ సీట్లు పెంచితే బాగుండేది : సజ్జల రామకృష్ణారెడ్డి

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు జరిగితే బాగుండేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు , వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగిందని... హామీలు అమలు కాకపోవడం మరింత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 2026 (delimitation of assembly constituencies) వరకు కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ (ysrcp) నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ సీట్లు పెంచి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విభజన హామీల్లో చాలా హామీలు అమలు కాలేదని సజ్జల అన్నారు. రాష్ట్ర విభజనే అన్యాయంగా జరిగిందని... హామీలు అమలు కాకపోవడం మరింత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం పాలనకు సంబంధించినదని సజ్జల చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం అంశాలు కీలకమని... మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలమని రామకృష్ణారెడ్డి అన్నారు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై బుధవారం కేంద్రం సమాధానమిచ్చింది. అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ  సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. అసెంబ్లీ స్థానాల పెరగాలంటే.. 2026 వరకు వేచి చూడాల్సిందేనని తెలిపిందే. అప్పటివరకు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా పార్లమెంట్ వేదికగా ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. 2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి వాటిల్లో సీట్లు పెంచే ఆలోచన తక్షణమే లేదని కేంద్రం పేర్కొంది.  

Also Read:ఏపీ, తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం సమాధానం.. ఏం చెప్పిందంటే.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం, 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిపింది. “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి, ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎటువంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెంచబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు చేయబడుతుంది’’ అని కేంద్రం చెప్పింది. కేంద్రం చెబుతున్న రూల్స్‌ ప్రకారం 2031 జనాభా గణన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల లేనట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం