ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో భరించలేక వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టాబితో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేయించారని ఆయన మండిపడ్డారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన పట్టాబితో పాటు ఈ వ్యాఖ్యలు చేయించిన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడా క్షమాపణలు చెప్పాలని ఏపీ ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు
also read:జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి
బుధవారం నాడు కడపలోని Ycp కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్ర ప్రకారంగానే Tdp అధికార ప్రతినిధి Pattabhi తో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయించారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. పట్టాబి వ్యాఖ్యలకు Chandrababu Naidu కు అర్ధం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. పథకం ప్రకారమే తమ పార్టీకి చెందిన నేతల ద్వారా చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను గమనించాలని ఆయన ప్రజలను కోరారు.చంద్రబాబునాయుడు ప్లాన్ ప్రకారమే నేతల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు.
టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా జగన్ మాత్రం సంయమనం పాటించాలని మమ్మల్ని ఆదేశించారని ఆయన చెప్పారు. కానీ టీడీపీ నేతలు సీఎం Ys jagan ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేక తిరగబడ్డారని ఆయన వివరించారు. జగన్ ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం చేస్తున్న పథకాలపై తప్పులుంటే ఎత్తి చూపాలన్నారు.కానీ అలా చేయకుండా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ నీచమైన భాషను ఉపయోగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.కరోనా సంక్షోభసమయంలో కూడా మాట తప్పకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కోల్పోయిందన్నారు. తన ఉనికిని కాపాడుకొనేందుకే చంద్రబాబునాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. తన స్వలాభం కోసం వ్యవస్థలన్నింటిని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికైనా చంద్రబాబ నీచ ఆలోచనలు మానుకొని ప్రజాభిమానం పొందే ప్రయత్నం చేయాలన్నారు.మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టాభి ఇంటితో పాటు గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడ అల్లరి మూకలు దాడులకు దిగాయి.ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి మారడం లేదన్నారు. చిరు వ్యాపారులు కష్టకాలం లో ఉంటే బంద్ కు పిలుపునివ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఎవరు బహిరంగంగా నే నీకు మద్దతు ఇవ్వలేదన్నారు.