
ఒంగోలు: సీఎం కాన్వాయ్ కి వాహనాలు కావాలని తిరుపతికి వెళ్లే కుటుంబం నుండి వాహనం తీసుకెళ్లిన ఘటనపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.AMVIసంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పల్నాడు జిల్లాలోని వినుకొండకు చెందిన Vemala Srinivas కుటుంబం బుధవారం నాడు Tirupatiకి వెళ్తుంది.Ongole పట్టణంలో టిఫిన్ చేసేందుకు వీరు తమ వాహనాన్ని నిలిపివేశారు.
అయితే టిఫిన్ చేస్తున్న వీరి వద్దకు ఆర్టీఏ కానిస్టేబుల్ వచ్చి ఇన్నోవా వాహనాన్ని తీసుకెళ్లాడు. తాము తిరుపతికి వెళ్తున్నామని చెప్పినా కూడా విన్పించుకోకుండా సీఎం పర్యటనకు వాహనం తీసుకెళ్తున్నామని తీసుకెళ్లారు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు వచ్చాయి.ఈ విషయాన్ని సీఎం YS Jagan సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇవాళ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఒంగోలులో తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల నుండి వాహనం తీసుకెళ్లిన ఏఎంవీఐ సంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది.
మరో వాహనంలో తిరుపతికి చేరుకొన్న శ్రీనివాస్ ఫ్యామిలీ
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలు దేరారు. ఒంగోలు పట్టణంలోని బుధవారం నాడు రాత్రి చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోట్ వద్ద శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి వాహనం అడిగాడు.
ఈ నెల 22న సీఎం ఒంగోలు టూర్ ఉంది. సీఎం కాన్వాయ్ కోసం వాహనం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి తీసుకెళ్లాడు. వాహనంతో పాటు డ్రైవర్ ను కూడా తీసుకెళ్లాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తాము ఇలా చేయాల్సి వచ్చిందని కానిస్టేబుల్ వారికి సారీ చెప్పి వాహనం తీసుకొని వెళ్లిపోయాడు. వాహనం లేకపోవడంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లోనే వారంతా రాత్రంతా ఉండిపోయారు.ఈ విషయమై పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే తమ దృష్టికి ఈ విషయం రాలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే వినుకొండలోని తమకు తెలిసిన వారికి పోన్ చేసి మరో వాహనాన్ని తెప్పించుకొన్నారు.ఈ వాహనాన్ని ఒంగోలు పట్టణంలోకి రాకుండా వీరంతా పట్టణానికి బయటకు వెళ్లి వాహనంలో తిరుపతికి చేరుకొన్నారు.