లోకేష్‌కు భద్రత మరింత కుదింపు: 8 నెలల్లో రెండోసారి

By narsimha lodeFirst Published Feb 6, 2020, 5:14 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం లోకేష్ భద్రతను కుదించింది. గతంలో ఉన్న భద్రత కంటే మరింత తగ్గించాలని నిర్ణయం తీసుకొంది. 


అమరావతి:  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను కుదించింది ఏపీ ప్రభుత్వం. 8 మాసాల్లో రెండు దఫాల్లో భద్రతను కుదించింది సర్కార్.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి భద్రతను కుదించడంపై  టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి లోకేష్‌‌కు  గతంలో జడ్ కేటగిరి భద్రత  ఉండేది.  అయితే  ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్ కేటగిరి నుండి వై ప్లస్ కేటగిరికి భద్రతను కుదించారు.

ప్రస్తుతం  వై ప్లస్ కేటగిరి భద్రతను ఎక్స్‌ కేటగిరికి కుదించారు.  8 మాసాల్లో రెండు సార్లు లోకేష్ భద్రతను కుదించడం ఉద్దేశ్యపూర్వకంగా  చేసిందేనని  టీడీపీ  నేతలు విమర్శలు చేస్తున్నారు. 

ఏపీలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత పలువురు టీడీపీకి చెందిన నేతలకు కూడ భద్రతను కుదించారు. చంద్రబాబునాయుడు భద్రతను కుదించారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం భద్రతను పునరుద్దించారు. 

 

click me!