టీటీడీ పాలకమండలి భర్తరప్‌కు జగన్ సర్కార్ యోచన

Published : Jun 14, 2019, 10:29 AM IST
టీటీడీ పాలకమండలి భర్తరప్‌కు జగన్ సర్కార్ యోచన

సారాంశం

టీటీడీ పాలకమండలిని భర్తరప్ చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. స్విమ్స్‌లో  తాను సిపారసు చేసిన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనపై ఒత్తిడి చేశారని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్  టీటీడీ ఈఓకు  ఫిర్యాదు చేశారు


తిరుపతి: టీటీడీ పాలకమండలిని భర్తరప్ చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. స్విమ్స్‌లో  తాను సిపారసు చేసిన వారికి ఉద్యోగాలను ఇవ్వాలని టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనపై ఒత్తిడి చేశారని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్  టీటీడీ ఈఓకు  ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  టీటీడీ పాలకమండలిని భర్తరప్ చేసే అవకాశం ఉందని సమాచారం.  ఈ విషయమై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

టీటీడీ చైర్మెన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌.... తన పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని  ఆయన ఇదివరకే ప్రకటించారు.  అయితే ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని  ఏపీ సర్కార్ భావిస్తోంది.

ఈ మేరకు ఆర్డినెన్స్‌ తీసుకురానుంది.  ఈ తరుణంలోనే స్విమ్స్‌లో తాను సిఫారసు చేసినవారికే ఉద్యోగాలను  కల్పించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా డైరెక్టర్ టీటీడీ ఈఓ సింఘాల్‌కు లేఖ రాశారు.  ఈ లేఖ ఆధారంగా ఈఓ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.

అయితే ఈ నివేదిక ఆధారంగా  టీటీడీ పాలకమండలిని భర్తరప్ చేయాలనే యోచనలో సర్కార్ ఉందనే ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వ వైఖరి తేలనుందని  సమాచారం.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు