లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది.
అమరావతి: లాక్ డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది.
కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దుకాణాలు తెరుచుకొనేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలు ఉదయం ఆరు గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
undefined
also read:గుడ్‌న్యూస్: హైద్రాబాద్‌లో ఉంటున్న వారు ఏపీకి రావొచ్చు, కానీ షరతు ఇదీ....
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ కు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బంగారు ఆభరణాలు, వస్త్రాల దుకాణాలు, చెప్పుల దుకాణాలకు కూడ అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది.
మరో వైపు తెరిచిన దుకాణాల వద్ద భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించని దుకాణాల యాజమాన్యంపై చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
అంతేకాదు దుకాణాల వద్ద విధిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.