అక్టోబర్ రెండు నుండి ఉద్యోగుల సమ్మె: నోటీసిచ్చిన ఏపీ గ్రామ పంచాయితీ ఉద్యోగులు

By narsimha lode  |  First Published Sep 5, 2022, 8:54 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తామని పేర్కొన్నారు. పంచాయితీరాజ్ కమిషనర్ కు నోటీసు అందించారు కార్మికులు.
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీ నుండి సమ్మె  చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు..సీఐటీయు అనుబంధంగా ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. డిమాండ్లతో ఏపీ పంచాయితీ రాజ్ కమిషనర్ కు సోమవారం నాడు  సమ్మె  నోటీసును ఇచ్చారు..

బకాయి జీతాలు చెల్లించి కార్మికుల  జీవితాలను కాపాడాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని  కార్మికులు డిమాండ్ చేశారు. సాధారణ మృతికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. నెలకు రూ. 6 వేల చొప్పున అక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ను ఇవ్వాలని కోరారు. పంచాయితీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు రూ. 20 వేల కనీస వేతనం చెల్లించాలని  ఆ నోటీసులో కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

Latest Videos

తమ డిమాండ్ల సాధన కోసం సీఐటీయు అనుబంధంగా ఉన్న కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.మూడు నుండి 20 నెలల వరకు కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 
 

click me!