కరోనా టీకా తీసుకున్న 49మందికి రియాక్షన్‌... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Jan 29, 2021, 10:21 AM IST
Highlights

ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.58 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వగా అందులో ఇప్పటివరకు 49 మంది వ్యాక్సినేషన్ అనంతరం రియాక్షన్‌ కు గురయ్యారు. 

అమరావతి: కీలకమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియనంత పర్యవేక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రని ఆరోగ్య శాఖ కార్యదర్శిగా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారి చేసింది. ఇలా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం వివిధ శాఖలతో సమన్వయం కోసం ప్రత్యేక పోస్ట్‌ను ప్రభుత్వం సృష్టించింది. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.58 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో ఇప్పటివరకు 49 మంది వ్యాక్సినేషన్ అనంతరం రియాక్షన్‌ కు గురయ్యారు. అలాగే ఇప్పటికే ఏపీలో ఒకరు మృతి చెందినట్లు, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి అవసరం అని ప్రభుత్వం భావించింది. అందువల్లే ప్రత్యేక అధికారిని నియమించింది.

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో(మంగళవారం నుండి బుధవారం వరకు) కొత్తగా 117 మందికి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,87,466కి చేరింది.  కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. అయితే ఇప్పటి వరకు కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య 7,152కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 1,358 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,78,956కి చేరుకుంది. 24 గంటల్లో 36,189 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 1,30,12,150కి చేరుకుంది.

ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 16, తూర్పు గోదావరి 6, గుంటూరు 17, కడప 4, కృష్ణా 26, కర్నూలు 7, నెల్లూరు 6, ప్రకాశం 3, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 19, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 7 కేసులు నమోదయ్యాయి. 


 

click me!