ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ సలహాదారుగా రామకోటయ్య

By Nagaraju TFirst Published Jan 11, 2019, 4:17 PM IST
Highlights

ప్రముఖ రాజకీయవేత్త చెరువు రామకోటయ్య బీజేపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పదవి వరించింది. నాలుగు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి తాను బ్రహ్మణుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. 
 

విశాఖపట్నం: ప్రముఖ రాజకీయవేత్త చెరువు రామకోటయ్య బీజేపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పదవి వరించింది. నాలుగు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసి తాను బ్రహ్మణుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. 

తాజాగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ, ధర్మదాయ శాఖ, గౌరవ  సలహాదారులుగా నియమించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయన చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన రామకోటయ్య జవనరి 7న బీజేపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామకోటయ్య రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. 

నేషనల్ బోర్డు అఫ్ ఎంప్లాయిస్ సభ్యుడిగా, స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, కన్వీనర్ అఫ్ స్టేట్ బీజేపీ ఫైనాన్స్ కమిటీ, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అఫ్ బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అఫ్ ఎయిర్ ట్రావెల్లెర్స్ అసోసియేషన్ అఫ్ ఏపీ, లైఫ్ మెంబెర్ అఫ్ ఇంటాచ్ వంటి పదవులను అధిరోహించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీకి షాకిచ్చిన రామకోటయ్య: సైకిల్‌పై సవారీ
 

click me!