నెల్లూరు స్టీల్ ప్లాంట్... జిందాల్ సంస్థకు 860ఎకరాలు

Arun Kumar P   | Asianet News
Published : Jul 15, 2021, 03:22 PM IST
నెల్లూరు స్టీల్ ప్లాంట్... జిందాల్ సంస్థకు 860ఎకరాలు

సారాంశం

నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ సంస్థకు జగన్ సర్కార్ 860 ఎకరాల భూమిని కేటాయించింది. 

అమరావతి: నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన  జిందాల్‌ సంస్థకు జగన్ సర్కార్ 860 ఎకరాల భూమిని కేటాయించింది. నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం-మోమిడి ప్రాంతాల పరిధిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 

నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 11.6 మి.టన్నుల సామర్థ్యంతో జిందాల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరగనుంది. దీంతో 2,500 మందికి ప్రత్యక్షంగా, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ప్లాంట్ విస్తరణకు 3 వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తోంది. 

read more  నష్టాల్లోని సంస్ధలను ప్రైవేటీకరించాలన్నదే కేంద్రం ఆలోచన..: విజయసాయి రెడ్డి (వీడియో)

గతంలో ప్రభుత్వం కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములు రద్దు చేసి జిందాల్‌కు స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించారు. ఇలా భూమి కేటాయింపు జరగడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభంకానుంది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో స్థానిక యువతకే కాదు ప్రజలందరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్