విద్యాశాఖకు బడ్జెట్‌లో పెద్దపీట: విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు

By narsimha lodeFirst Published Jun 16, 2020, 1:41 PM IST
Highlights

విద్యా శాఖపై ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఉన్నత విద్యకు 2 వేల 270 కోట్లు, మన బడి నాడు నేడు అనే పథకం కింద ఈ ఏడాది బడ్జెట్ లో 3 వేలు కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

అమరావతి:విద్యా శాఖపై ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఉన్నత విద్యకు 2 వేల 270 కోట్లు, మన బడి నాడు నేడు అనే పథకం కింద ఈ ఏడాది బడ్జెట్ లో 3 వేలు కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రాష్ట్రాన్నిచదువుల బడిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా  మంత్రి ప్రకటించారు.

ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొనే విద్యార్థులకు మూడు జతల స్కూల్ యూనిఫారాలు, బూట్లు కూడ అందింస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠ్యపుస్తకాలు కూడ  విద్యార్థులకు ఉచితంగా అందించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో పుష్టికరమైన భోజనాన్ని అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరి నుండి కొత్త మెనూను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు పుష్టికరమైన భోజనం అందించేందుకు జగనన్న గోరు ముద్ద పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.

మధ్యాహ్నం భోజనం స్కీమ్ కింద వంట చేసే మనుషులకు వేతనాలను వెయ్యి నుండి మూడు వేలకు పెంచుతున్నట్టుగా  ప్రభుత్వం తెలిపింది. జగనన్న అమ్మఒడి పథకం కింద 1 నుండి 12వ తరగతి కింద ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీపీఎల్ పరిధిలోని కుటుంబాల విద్యార్థులు చదువుకొనే వెసులుబాటు ఉంటుందని ప్రకటించారు మంత్రి.

ప్రభుత్వ విద్యా సంస్థలు నాడు నేడు స్కీమ్ కింద రూ. 3 వేలను కేటాయిస్తున్నట్టుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇక ఉన్నత విద్యకు కూడ ప్రభుత్వం భారీగా కేటాయిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూసా కింద నిధులు విడుదలౌతున్నాయన్నారు.
 

click me!