దాడులు చేయించడం మా సంస్కృతి కాదు: బీజేపీ నేత సత్యకుమార్‌ దాడిపై సజ్జల

By narsimha lodeFirst Published Mar 31, 2023, 4:53 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శల పేరుతో  బూతులు తిడుతున్నారని  వైసీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  అమరావతికి  చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు.  

గుంటూరు: దాడులు చేయించడం  తమ సంస్కృతి కాదని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. శుక్రవారంనాడు తాడేపల్లిలో  సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేత  సత్యకుమార్ కారుపై  దాడి ఘటనను మీడియా ప్రతినిధులు  సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎంపై  విమర్శలు పద్దతి ప్రకారం  ఉండాలన్నారు.

విమర్శల పేరుతో  బూతులు తిట్టడం సరైందా అని ఆయన  ప్రశ్నించారు.  దాడులు  చేయడం తమ సంస్కృతి కాదన్నారు.అమరావతికి  చంద్రబాబు ఏం చేశారని  ఆయన  ప్రశ్నించారు.అమరావతిలో  వేల కోట్ల ల్యాండ్ స్కాం  చేశారన్నారు. .  వికేంద్రీకరణను  చంద్రబాబు నాయుడు  ఎందుకు వ్యతిరేకిస్తున్నారని  ఆయన  ప్రశ్నించారు.   టీడీపీకి  పదవులు, అధికారం ముఖ్యమని  సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Latest Videos

అమరావతి అభివృద్దికి ఎలాంటి డోకా లేదని  ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని  సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు  చేశారు. అమరావతి పేరుతో  జరుగుతున్నది ఉద్యమం కాదన్నారు.  రాజధాన అంశాన్ని చంద్రబాబు  రాజకీయం  కోసం వాడుకుంటున్నారని  ఆయన విమర్శించారు.  చంద్రబాబు ఉచ్చులో  ఇతర పార్టీలు   చిక్కుకోవద్దన్నారు. తాను   అధికారంలోకి రావడానికి  తోడేళ్ల మందను ఏకం చేస్తున్నారని చంద్రబాబుపై  విమర్శలు గుప్పించారు.

also read:పథకం ప్రకారం నాపై దాడి: బీజేపీ నేత సత్యకుమార్

రాష్ట్రానికి నిధుల కోసం  సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారన్నారు. ఈ విషయమై కూడా  విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కర్నూల్ కు  న్యాయ రాజధాని కావాలని బీజేపీ  కోరిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  కానీ ఇప్పుడు అన్ని అమరావతిలోనే  ఉండాలని బీజేపీ ఎందుకు  స్టాండ్  మార్చిందని  ఆయన ప్రశ్నించారు. రామోజీరావు  మోసాలు  వరుసగా  బయటడడుతున్నాయన్నారు.మార్గదర్శి  అక్రమాలపై  చర్యలు తప్పవన్నారు.సీఐడీ దర్యాప్తులో  నిర్ఘాంతపోయే  వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.. 
 

click me!