చంద్రబాబు అసైన్‌మెంట్‌తోనే వారాహి యాత్ర: పవన్ పై సజ్జల సెటైర్లు

Published : Jun 14, 2023, 05:15 PM IST
 చంద్రబాబు అసైన్‌మెంట్‌తోనే  వారాహి యాత్ర: పవన్ పై  సజ్జల సెటైర్లు

సారాంశం

చంద్రబాబు  సూచన మేరకే  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  వారాహి యాత్ర  నిర్వహిస్తున్నారని  ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.

అమరావతి:  చంద్రబాబు ను సీఎం  చేయాలనే  లక్ష్యంతోనే  పవన్ కళ్యాణ్  వారాహి యాత్రను చేపట్టారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు..బుధవారంనాడు తాడేపల్లిలో ఆయన  మీడియాతో మాట్లాడారు. మీనమేషాలు లెక్కించి వారాహి  యాత్రకు   పవన్ కళ్యాణ్  వారాహి  యాత్రకు  బయలుదేరారన్నారు. 

చంద్రబాబు ఇచ్చిన అసైన్ మెంట్ తోనే  పవన్ యాత్ర చేస్తున్నారని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని నాలుగు డైలాగ్ లు  రాసుకుని  పవన్ యాత్రకు వెళ్లారన్నారు.పవన్ తనను నమ్ముకున్నవారిని కూడ మోసం  చేస్తున్నారని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.రాజకీయం అంటే పవన్ కు తెలియదన్నారు.  పవన్ కు  రాజకీయపార్టీ అధినేతకు  ఉన్న విలువలు లేవని ఆయన విమర్శించారు. ఎవరైనా యాత్రలు  చేసుకోవచ్చన్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి  నుండి  వారాహి యాత్రను  ఇవాళ  ప్రారంభించనున్నారు.  తూర్పు గోదావరి జిల్లా తర్వాత  పశ్చిమ గోదావరి జిల్లాలో  పవన్ కళ్యాణ్ యాత్రను  నిర్వహిస్తారు. ఈ రెండు  జిల్లాల్లో యాత్రలు  పూర్తైన  తర్వాత   ఇతర  జిల్లాల్లో  యాత్రను  పవన్ కళ్యాణ్  చేపట్టనున్నారు. తెలంగాణ లో కూడ  వారాహి యాత్ర  నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్  ప్రకటించిన విషయం తెలిసిందే. 

వారాహి  యాత్రను  చేపట్టాలని  గతంలోనే  పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు. కానీ  జనవాణి  కార్యక్రమాలు  అన్ని  నియోజకవర్గాల్లో పూర్తి కాకపోవడంతో పాటు  ఇతరత్రా కారణాలతో  యాత్రను  వాయిదా వేసుకున్నారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!