వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా దుష్ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి

By narsimha lode  |  First Published May 23, 2023, 1:41 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  విషయంలో  ఎల్లో మీడియా తప్పుడు  ప్రచారం  చేస్తుందని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  మండిపడ్డారు.



అమరావతి: కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో  ఓ వర్గం మీడియా తప్పుడు  ప్రచారం  చేస్తుందని  ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి   మంగళవారంనాడు  తాడేపల్లిలో  మీడియాతో మాట్లాడారు. తల్లి  ఆరోగ్యం  బాగా లేకపోతే  నాటకాలు అంటూ  ప్రచారం చేస్తారా అని  సజ్జల రామకృష్ణారెడ్డి  మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్  అవినాష్ రెడ్డి  ఇప్పటికే  ఆరు దఫాలు  సీబీఐ విచారణకు  హాజరయ్యారన్నారు.  

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐకి సహకరిస్తున్నారన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో   అవవసర  కథనాలు, అసత్యాలు  ప్రచారం చేస్తున్నారని  ఆయన  ఓ వర్గం మీడియాపై  మండిపడ్డారు.  అవినాష్ రెడ్డి విషయంలో కూడా రోత రాతలు రాస్తున్నారని  ఆయన  విమర్శించారు.  అవినాష్ రెడ్డి  అంశం  కోర్టు  పరిధిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  

Latest Videos

undefined

also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సుప్రీం ఆదేశం

:సీఎం  జగన్  పాలనను చూసి  విపక్షాలు కడుపుమంటతో  రగిలిపోతున్నాయని నాలుగేళ్లుగా  ప్రజలకు ఇచ్చిన  హామీల్లో 98.5 శాతం నెరవేర్చినట్టుగా  ఆయన  చెప్పారు.  అర్హులందరికీ  సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.  తమ ప్రభుత్వంపై  ఎల్లో మీడియా దుష్ప్రచారం  చేస్తుందని ఆయన  విమర్శించారు.   కేంద్ర ప్రభుత్వ సంస్థలు  ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని  ఆయన గుర్తు  చేశారు. 

click me!