త్వరలోనే విశాఖ నుండి పాలన: సజ్జల కీలక వ్యాఖ్యలు

Published : Oct 21, 2022, 04:07 PM ISTUpdated : Oct 21, 2022, 04:53 PM IST
త్వరలోనే  విశాఖ నుండి  పాలన: సజ్జల కీలక వ్యాఖ్యలు

సారాంశం

విశాఖ నుండి పరిపాలన  ప్రారంభిస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.చంద్రబాబుకు ప్రయోజనం కలిగేలా  పవన్  కళ్యాణ్  వ్యవహరిస్తున్నారన్నారు.  

అమరావతి:త్వరలోనే విశాఖ నుండి పరిపాలన  చేస్తామని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల  రామకృష్ణారెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. .  రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం పరిపాలన వికేంద్రీకరిస్తున్నట్టుగా చెప్పారు.ఐదేళ్లలో  చంద్రబాబునాయుడు  కనీసం కరకట్ట కూడ నిర్మించలేదని  ఆయన  ఎద్దేవా  చేశారు.మూడు రాజధానులకు వ్యతిరేకంగా  కృత్రిమ ఉద్యమాన్ని  చంద్రబాబు  తీసకువచ్చారన్నారు. ప్రజల్లో  లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారని పరోక్షంగా చంద్రబాబుపై ఆయన  సెటైర్లు  వేశారు.

పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిందన్నారు .చంద్రబాబుకు  ప్రయోజనం కల్గించేలా  పవన్  కళ్యాణ్ వ్యవహరశైలి ఉందన్నారుగతంలో  కూడ  పవన్ కళ్యాణ్  ఇలానే వ్యవహరించారని ఆయన  గుర్తు చేశారు. 2019 లో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు  వ్యవహరించలేదో చెప్పాలన్నారు.మూడు రాజధానులపై విపక్షాలు  చేస్తున్న ప్రచారం అర్ధం లేదన్నారు. విపక్షాల కుట్రలను భగ్నం  చేయాల్సిన  అవసరం ఉందన్నారు.ఈ కుట్రను భగ్నం  చేయలేకపోతే రాష్ట్రం  చీకట్లోకి వెళ్తుందన్నారు.మూడు రాజధానుల అంశంపై  ప్రజల  దృష్టిని  మరల్చేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని  చంద్రబాబు ప్రజల  దృష్టిని మరల్చే ప్రయత్నాలు  చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  మూడు రాజధానుల  అంశాన్నితెరమీదికి తెచ్చింది. 2014లో అమరావతిలో రాజధానికి  వైసీపీ సమ్మతించిన విషయాన్ని విపక్షాలు గుర్తు  చేస్తున్నాయి. మూడు రాజధానులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారు

 మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న  పాదయాత్రకు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని  కొనసాగించాలని కోరుతూ అమరావతి  రైతులు అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్ర  చేస్తున్నారు. ఈ పాదయాత్ర తూర్పుగోదావరి  జిల్లాలో సాగుతుంది . 

అయితే  మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ  రౌండ్ టేబుల్స్ నిర్వహించింది.  మూడు రాజధానులకు మద్దతుగా  జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతును  ప్రకటించింది. మూడు రాజధానులకు మద్దతుగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని  వైసీపీ నిర్వహిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?