ఏ అవసరం ఉన్నా అడగండి: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, మూడు జిల్లాల కలెక్టర్లకు ఫోన్

By narsimha lode  |  First Published Nov 18, 2021, 8:58 PM IST


ఏపీ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో  కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో  సీఎం జగన్ ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


అమరావతి:  రాష్ట్రంలోని తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నాడు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు.ఎప్పటికప్పుడు చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలను పరిశీలిస్తుండాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు.అవసరమైన సిబ్బందిని అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. వైద్య , ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా కూడా రాజీపడాల్సిన అవసరం లేదని సీఎం Ys Jagan అధికారులను ఆదేశించారు. ఏం కావాలన్నా కూడా వెంటనే అడగాలని సీఎం కోరారు. నిరంతరం తాను అధికారులకు అందుబాటులో ఉంటానని సీఎం కలెక్టర్లకు చెప్పారు. ndrf, sdrf సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

మూడు జిల్లాలకు  రెడ్ అలెర్ట్

Latest Videos

చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా ఈ మూడు జిల్లాల్లో heavy rains కురుస్తున్నాయి. nellore, kadapa, chittoor జిల్లాల్లో కూడా వర్షాలు జన జీవనాన్ని స్థంభింప చేశాయి.

also read:భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత: టీటీడీ

చిత్తూరు జిల్లాలో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని మదనపల్లిలో బహుదా కాలువ పొంగిపొర్లుతోంది.దీంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. పలు కాలనీల్లో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మెదర బజార్,  బుగ్గకాలువ కాలనీలు నీటిలో ముగినిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.జంగాలపల్లె వాగులో చిక్కుకొన్నప్రైవేట్ స్కూల్ బస్సు చిక్కుకుంది. ఈ స్కల్ బస్సులో విద్యార్ధులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

టెంపుల్ సిటీని ముంచెత్తిన వర్షం

tirupati లో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. tirumala వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తుమ్మలగుంట చెరువు తెగడంతో తిరుపతి వైపు నీటి ప్రవాహం కొనసాగుతుంది. కళ్యాణి డ్యామ్ నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దిగువకు నీటిని విడుదల చేయడంతో  పలు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. రోడ్లపై ప్రమాదకరస్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తోంది.కపిల తీర్థం జల దిగ్భంధంలోనే ఉండిపోయింది.కపిల తీర్ధం వద్ద వరద ప్రవాహానికి ఎనిమిది అడుగుల గోడ కుప్పకూలింది. "

భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల ఘాట్ రోడ్లను టీటీడీ మూసివేసింది.దీంతో పాటుగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను కూడా టీటీడీ మూసివేసింది.భారీ వర్షాలతో ప్రమాదకరమైన పరిస్థితి నెలకొందని తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రకటించారు. అవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావాలని ఆయన కోరారు. తిరుపతి ఘాట్ రోడ్డులోని 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. 10 జేసీబీలతో కొండ చరియలను తొలగిస్తున్నారు అధికారులు.ఇవాళ రాత్రికి కొండ చరియల తొలగింపు పూర్తయ్యే అవకాశం ఉంది. దొడ్డిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీటిలో చిక్కుకుపోయిన స్కూల్ బస్సులో నుండి సురక్షితంగా విద్యార్ధులను బయటకు తీసుకొచ్చారు అధికారులు. 

click me!