ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. కేసీఆర్ పై కోపంతోనే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
అమరావతి: హరీష్ రావు సర్టిఫికెట్లు తమ ప్రభుత్వానికి అవసరం లేదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.ఆదివారంనాడు తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. తమకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని హరీష్ రావు చేసిన విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంంత్రి హరీష్ రావుకు తన మామ కేసీఆర్ పై కోపం ఎక్కువన్నారు. కేసీఆర్ ను ఎవరైనా తిడితే హరీష్ రావు అనందపడుతాడన్నారు. దమ్మున్నవాళ్లతో కేసీఆర్ ను తిట్టించాలని హరీష్ రావు భావిస్తున్నాడనిపిస్తుందన్నారు.
2018 ఎన్నికల్లో హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవ్వాలనుకున్నారన్నారు. ఈ విషయం తెలిసి హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారని పేర్నినాని చెప్పారు.ఈ విషయం తెలంగాణలో అందరికీ తెలుసునన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ తో కలవాలని హరీష్ రావు ప్లాన్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఈ విషయం తెలిసి హరీష్ రావును జైల్లో వేయిస్తానని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడని పేర్నినాని ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణలో కథలు కథలుగా చెప్పుకుంటారన్నారు.
undefined
అమాంతం మామను తోసేసి ఆ కుర్చీపై కూర్చోవాలనే కోరిక హరీష్ రావుకు ఉందని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.చీకట్లో మామను బెదిరిస్తుంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని హరీష్ రావు పేర్ని నాని ఆరోపణలు చేశారు. ఈ బ్లాక్ మెయిల్ కు చెక్ పెట్టేందుకే హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. చేతలు ఎక్కువైనందుకే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టారన్నారు. కేసీఆర్, బావమరిది కేటీఆర్ పై హరీష్ రావుకు ఈర్ష్య, కోపమెక్కువని ఆయన చెప్పారు.
చంద్రబాబు ప్లాన్ కు ఆనాడు ఎన్టీఆర్ బలయ్యాడన్నారు. కానీ కేసీఆర్ ముదురు కాబట్టి హరీష్ రావుకు బుద్ది చెప్పారన్నారు. మరోసారి తమ సీఎం జ.గన్ పై ఇలానే విమర్శలు చేస్తే హరీష్ రావు కోరిక మేరకు కేసీఆర్ పై విమర్శలు చేస్తామన్నారు. హరీష్ రావు సర్టిఫికెట్లు తమ ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. కేసీఆర్ ను తిట్టే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. అందుకే వైఎస్ జగన్ పై హరీష్ రావు విమర్శలు చేస్తున్నాడన్నారు.