ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి స్కూల్స్ తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట స్కూల్స్ నిర్వహించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం పదకొండున్నర గంటల వరకే స్కూల్స్ నడపనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట స్కూల్స్ నిర్వహించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ లో స్కూల్స్ ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంవత్సరం విద్యా క్యాలెండర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
నైరుతి రుతుపవనాలు వారం రోజుల పాటు ఆలస్యంగా కేరళను తాకాయి. అయితే కేరళ నుండి దేశ వ్యాప్తంగా నైరుతి తుతుపవనాలు విస్తరించడానికి సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఇంకా ఆయా రాష్ట్రాల్లో వేసవి తీవ్రత కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉష్ణోగ్రతలు తగ్గి న తర్వాత రెండు పూట స్కూల్స్ నిర్వహించనున్నారు