పాలు ఇచ్చే ఆవును కాదని దున్నను తెచ్చుకున్నారు : ఓటమిపై చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Aug 7, 2019, 3:33 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. 
 
గుంటూరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యులు చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. 

గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కార్యకర్తలతో పార్టీ ఓటమిపై చర్చించారు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని వారిని ఉత్తేజపరిచేవిధంగా మాట్లాడారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చారు. 

తాను నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టిసీమ నీళ్లు తాగారని కానీ ఓటు వేయడం మరచిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

click me!