
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. AP EAPCET Results 2022 ను విడుదల చేశారు. విద్యార్తులు ఫలితాలనుఅధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య 1,73,752గా ఉంది. వ్యవసాయ విభాగంలో 95.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య 83,411గా ఉంది.
ఈఏపీసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు. జూలై 4 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.
ఇక, ఈఏపీసెట్‌కు మొత్తం 3,01,172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,82,496 మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్‌కు 1,94,752, వ్యవసాయ పరీక్షకు 87,744 మంది విద్యార్థులు హాజరయ్యారు.