పేదల కోసమే లిక్కర్ రేట్లు పెంచాం: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

By Siva KodatiFirst Published Oct 1, 2019, 3:25 PM IST
Highlights

కొత్త మద్యం విధానంపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా ఎత్తివేస్తున్నామని.. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మకాలు ఉంటాయని స్పష్టం చేశారు

కొత్త మద్యం విధానంపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా ఎత్తివేస్తున్నామని.. ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మకాలు ఉంటాయని స్పష్టం చేశారు.

గతంలో ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచివుండేవని ఆయన గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతిస్తుందని నారాయణ స్వామి తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరలు డిస్‌ప్లే బోర్డులో పెట్టామని... ధరలు పెంచితే పేదవారు మద్యానికి దూరమవుతారన్ని ప్రభుత్వ ఆలోచనగా వెల్లడించారు.

నాటుసారా, మద్యం బ్లాక్ మార్కెట్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యపాన నిషేధం అమలులో జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని నారాయణ స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.     

click me!