ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని చెప్పుకొచ్చింది. ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించింది. ఆ ప్రముఖ దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది.
సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం గురించి చర్చే రాలేదని స్పష్టం చేశారు. కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ఆ దినపత్రిక కథనం కల్పితంగా భావిస్తున్నట్లు సీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని చెప్పుకొచ్చింది. ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించింది. ఆ ప్రముఖ దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడింది.
ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని స్పష్టం చేసింది.
గత నాలుగు నెలలుగా ఉభయం రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం గురించి ప్రస్తావించింది.
రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కథనాలు సరికాదని హితవు పలికింది. గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలిపింది.
ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల మఖ్యంత్రులు చర్చించినట్లు స్పష్టం చేసింది.
పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్‌కానిస్టేబుళ్లకు ఏపీలోకూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా కూడా చర్చ జరిగినట్లు సీఎంవో కార్యాలయం అభిప్రాయపడింది.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని తెలిపింది. సోమవారం జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చర్చకు రాలేదని తెలిపారు.
ఇలాంటి సమావేశంమీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
అభిప్రాయపడింది. ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రగతి భవన్‌లో మూడు గంటలుగా కొనసాగుతున్న కేసీఆర్, జగన్ భేటీ
ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్, జగన్