అమరావతిలో నిర్మాణాలకు జగన్ గ్రీన్‌సిగ్నల్: రైతులకు ప్లాట్లు కూడా...

By sivanagaprasad KodatiFirst Published Nov 25, 2019, 9:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనుల కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాజధాని పరిధిలోని ప్రాధాన్యతల ఆధారంగా నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా పనులుండాలని జగన్ సూచించారు. ఖజానాపై భారం తగ్గించుకోవడానికే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని... భూమిలిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Also Read:మోడల్ టౌన్స్ గా కడప, పులివెందుల: ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్ పై జగన్ సమీక్ష

ఈ సందర్భంగా సీఆర్‌డీఏ పరిధిలో నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే విషయంపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్ల డిజైన్ల గురించి కూడా ఆరా తీశారు. సీఆర్‌డీఏ పరిధిలో ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులు ఉండకూడదని అధికారులను జగన్ ఆదేశించారు. 

రహదారుల ఖర్చు, డిజైన్ల అంశాలపై ఐఐటీ సంస్దల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొండవీటి, పాలవాగు వరద ప్రవాహంపైనా జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌ పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంలో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప, పులివెందులను మోడల్ టౌన్స్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 

సమీక్షా సమావేశంలో టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు అధికారులు. వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఎస్టిమేషన్‌ వివరాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు తెలిపారు. 

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం వైఎస్ జగన్. బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలని సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా దూపొందించాలని ఆదేశించారు. 

కాలక్రమేణా సుందరీకరణప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 

పులివెందుల మోడల్ టౌన్ గా రూపుదిద్దుకునేందుకు అవసరమయ్యే సహాయాన్కని పులివెందుల ఏరియా డవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకొవాలని సూచించారు. పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికకు సంబంధించి నివేదికన సీఎం జగన్ కు అందజేశారు అధికారులు. 

Also Read:బాబుకు షాక్: ఓటుకు నోటు కేసులో సుప్రీంలో ఆళ్ల మరో పిటిషన్

అలాగే విశాఖపట్నంలో లుంబినీ పార్క్‌ అభివృద్దిని కూడా సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

click me!