ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్

By sivanagaprasad KodatiFirst Published Dec 17, 2019, 6:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయమోనన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ .. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయమోనన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ .. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు.

ఈ క్రమంలో అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని జగన్ గుర్తుచేశారు.

పాలన ఒక దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని దీని ఆధారంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

read more  టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: స్పీకర్ తమ్మినేని విచారం

అమరావతికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 5 వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని జగన్ ఆరోపించారు. రూ.5,080 కోట్లకు సంబంధించి దానిపై వడ్డీనే రూ.700 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు.

లక్షా 9 వేల కోట్ల రూపాయల ప్రణాళికలో మిగిలిన పెట్టుబడి పెట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సైతం అద్భుతమైన రాజధానిని నిర్మించాలని ఉందని తెలిపారు.

భారీ వర్షాలు కురిసినా ఇంతవరకు రాయలసీమలో రిజర్వాయర్లు నిండలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే రూ.16 వేల కోట్లు ఖర్చవుతుందని జగన్ తెలిపారు.

read more  అమరావతిలో టీడీపీ నేతల ఆస్తుల చిట్టా ఇదే

ఉభయ గోదావరి జిల్లాల్లో అక్వా సాగు వల్ల తాగడానికి నీరు లేదని, బోర్లలో ఉప్పు నీరు పడుతుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి తాగడానికి నీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం కోసం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చువుతందని జగన్ పేర్కొన్నారు. 

నాడు-నేడు పథకం కింద స్కూళ్లను రిపేర్ చేయాలంటే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారని సీఎం తెలిపారు. 40 ఏళ్ల అనుభవం వున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని జగన్ ప్రశ్నించారు.

విశాఖలో అన్ని వున్నాయని.. ఒక మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తే సరిపోతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామన్నారు. 

 

click me!