ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 11న తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన తిరుమలకు వెళ్తారని అధికారులు తెలిపారు. గన్నవరం నుండి తిరుమలకు వెళ్లి శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం ys jagan తిరుమల టూర్ ఖరారైంది. ఈ నెల 11వ తేదీన ఏపీ సీఎం జగన్ tirumalaకు చేరుకొంటారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
also read:వెంకన్న దర్శనానికి నకిలీ టికెట్లు: టీటీడీ ఛైర్మెన్ పేరుతోనే బురిడీ
undefined
తిరుమలలో ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ vijayawada నుండి renigunta విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుండి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకొని srivari brahmotsavamలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. దీంతో సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్నారు.
కరోనా నేపథ్యంలో ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ttd నిర్ణయం తీసుకొంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. కరోనా కారణంగా ఈ ఏడాది కూడ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అవకాశం లేకుండా పోయింది.