ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అప్పులు, చక్రవడ్డీలను ఏపీ ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు అందిస్తోందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై jana sena చీఫ్ pawan kalyan ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని అరుపులు అరిచినా.... రాష్ట్ర బడ్జెట్ ను ఎంత మసిపూసి మారెడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదన్నారు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేదని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
undefined
ycp సర్కార్ మౌలిక ఆర్దిక సూత్రాన్ని విస్మరించిందని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన AP government అప్పులు, సంపాదనకు సంబంధించి ఓ చిత్రాన్ని ఈ ట్వీట్ కు జతపర్చారు పవన్ కళ్యాణ్.
విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర ధరల పెరుగుదల,చెత్తపై పన్ను, ఆస్తి పన్ను, బస్సు చార్జీల పెంపు, పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రజల నుండి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో ys jagan ప్రభుత్వం కొంతమంది ప్రజలకు నవరత్నాలను అందిస్తోందని జనసేన చీఫ్ ఆ ట్వీట్ ద్వారా వివరించారు.
also read:పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అఫైర్ వ్యాఖ్యలు.. నాలుక కరుచుకుని...
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులను అభివృద్ది చేస్తోందని సెటైర్లు వేశారు. భావితరాలకు వైసీపీ సర్కార్ అప్పులు, అప్పులకు వడ్డీలు,చక్రవడ్డీలను కానుకగా ఇస్తోందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం తీరుపై జనసేన చీఫ్ ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఏపీ సీఎం జగన్ పై ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు, మంత్రులు అదే స్థాయిలో కౌంటరిచ్చారు. ఈ కౌంటర్ కు పవన్ కళ్యాణ్ కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. వైసీపీ నేతలు భయమంటే ఎలా ఉంటుందో చూపుతానని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.