అనంత బయల్దేరిన జగన్: కొద్దిసేపట్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం

Siva Kodati |  
Published : Oct 10, 2019, 11:00 AM ISTUpdated : Oct 10, 2019, 11:15 AM IST
అనంత బయల్దేరిన జగన్: కొద్దిసేపట్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం

సారాంశం

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ప్రపంచ కంటి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు, కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయనున్నారు.

ఈ పథకం మొత్తం మూడేళ్ల పాటు అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఐదు దశల్లో అమలయ్యే ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. కాగా ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన అనంతపురం బయల్దేరనున్నారు. 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP