ఘోర ప్రమాదం... అనంతపురంలో బస్సు బోల్తా

Published : Oct 10, 2019, 09:18 AM IST
ఘోర ప్రమాదం... అనంతపురంలో బస్సు బోల్తా

సారాంశం

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 11 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించారు.

అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా రహదారిపై బోల్తాపడింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 11 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించారు.

ఇక బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను వెంటనే అక్కడి స్థానికుల సహాయంతో పోలీసులు బయటికి తీసి వారిని రక్షించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ నిద్రపోతూ.. డ్రైవింగ్ చేశాడని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్