అధికారంలో వున్న వాళ్లు ప్రజలకు సేవకులు : క్రిస్మస్ వేడుకల్లో జగన్

Siva Kodati |  
Published : Dec 20, 2022, 09:36 PM IST
అధికారంలో వున్న వాళ్లు ప్రజలకు సేవకులు : క్రిస్మస్ వేడుకల్లో జగన్

సారాంశం

అధికారంలో వున్నవాళ్లు ప్రజలకు సేవకులన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో క్రైస్తవ సోదరులకు ఏపీ ప్రభుత్వం తేనేటి విందును ఏర్పాటు చేసింది.   

క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ సోదరులకు తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. మంగళవారం విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికారంలో వున్నవాళ్లు ప్రజలకు సేవకులన్నారు. ఇంకా ప్రజలకు ఒదిగి వుండాలని.. దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే తాను ఈ స్థాయిలో వున్నాని జగన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇంకా గొప్ప సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా వుందని సీఎం అన్నారు. జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే