ప్రభుత్వంపై బురద.. ఆడపిల్లల గౌరవంతో రాజకీయాలు: ప్రతిపక్షాలపై జగన్ పరోక్ష విమర్శలు

Siva Kodati |  
Published : Aug 25, 2021, 04:19 PM IST
ప్రభుత్వంపై బురద.. ఆడపిల్లల గౌరవంతో రాజకీయాలు: ప్రతిపక్షాలపై జగన్ పరోక్ష విమర్శలు

సారాంశం

కొందరు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సీఎం జగన్ పరోక్షంగా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ఆడపిల్లల  గౌరవాలను మంటగలుపుతున్నారని సీఎం మండిపడ్డారు.

రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం  కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్ధితి నెలకొందని జగన్ అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్వీపీలను ఖచ్చితంగా పాటించాలని జగన్ సూచించారు. లక్షణాలు వుంటే విద్యార్ధులకు తక్షణమే పరీక్షలు చేయాలని.. కొందరు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ఆడపిల్లల  గౌరవాలను మంటగలుపుతున్నారని సీఎం మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా  వుండాలని జగన్ ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu