ఎంపీపీ ఎన్నిక రగడ: జగన్ వద్దకు చేరిన దర్శి పంచాయతీ.. బూచేపల్లి, మద్ధిశెట్టిలకు క్లాస్ పీకిన సీఎం

By Siva KodatiFirst Published Sep 21, 2021, 9:51 PM IST
Highlights

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య వివాదం సీఎం జగన్ వద్దకు చేరింది. ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రగడ మొదలైంది. ఎంపీపీ పదవి తమ వర్గానికి చెందిన వారినే నియమించాలని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య వివాదం సీఎం జగన్ వద్దకు చేరింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రగడ మొదలైంది. ఈ క్రమంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు దర్శి నియోజకవర్గ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎంపీపీ పదవి తమ వర్గానికి చెందిన వారినే నియమించాలని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సీఎం జగన్ కలిశారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చిన ఆయన.. కలసి పని చేయాలని ఆదేశించారు. ముండ్లమూరు ఎంపీపీగా ఎవరిని నియమించాలో సీల్డ్ కవర్ ద్వారా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. 

click me!