24 గంటల్లో 244 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,63,906కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 21, 2021, 09:33 PM IST
24 గంటల్లో 244 కొత్త కరోనా కేసులు, తెలంగాణలో 6,63,906కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 296 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,938 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 244 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,63,906కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,907కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో మహమ్మారి బారి నుంచి 296 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,55,061కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 4,938 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 8, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 3, కామారెడ్డి 1, కరీంనగర్ 19, ఖమ్మం 17, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 4, మంచిర్యాల 7, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 2, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 19, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 1 , పెద్దపల్లి 9, సిరిసిల్ల 4, రంగారెడ్డి 18, సిద్దిపేట 2, సంగారెడ్డి 3, సూర్యాపేట 5, వికారాబాద్ 1, వనపర్తి 3, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 14, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu