బుద్ది పెరగలేదు: అచ్చెన్నాయుడుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Published : Jul 12, 2019, 11:10 AM IST
బుద్ది పెరగలేదు: అచ్చెన్నాయుడుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

 ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, కరణం బలరాంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రౌడీలను, గుండాలను తయారు చేశారంటూ టీడీపీ సభ్యులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, కరణం బలరాంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రౌడీలను, గుండాలను తయారు చేశారంటూ టీడీపీ సభ్యులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు  ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విపక్షంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది పర్చూరు కాదు...అసెంబ్లీ అంటూ కరణం బలరాంను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

సభలోకి రౌడీలను, గుండాలను తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.  ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతకుముందు టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును ఉద్దేశించి జగన్  విమర్శించారు.

పర్సనాలిటీ పెరిగితే చాలదు.. బుద్ది పెరగాలని అచ్చెన్నాయుడుపై సీరియస్ కామెంట్స్ చేశారు.  కూర్చోవయ్యా.... కూర్చోవయ్యా అంటూ అచ్చెన్నాయుడుపై జగన్ మండిపడ్డారు.  అధికార, విపక్షాల మధ్య  విమర్శల నేపథ్యంలో  సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు: జగన్

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్