సంక్షేమ క్యాలెండర్ చంద్రబాబుకు ఫేర్‌వెల్ క్యాలెండర్: ఏపీ అసెంబ్లీలో జగన్

By narsimha lode  |  First Published Mar 25, 2022, 2:19 PM IST


ఏపీ అసెంబ్లీలో సంక్షేమ క్యాలెండర్ ను ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ కు సమాధానం చెప్పే సమయంలో సంక్షేమ క్యాలెండర్ ను కూడా జగన్ విడుదల చేశారు.



అమరావతి: తమ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్  Chandrababu కు ఫేర్‌వెల్ క్యాలెండర్ గా మారనుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

AP Assemblyలో  బడ్జెట్‌పై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం YS Jagan సమాధానమిచ్చారు.  ఈ సందర్భంగా సంక్షేమ క్యాలెండర్ ను సీఎం జగన్ విడుదల చేశారు. 

Latest Videos

ఏప్రిల్ మాసంలో  వసతి దీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు, మేలో విద్యా దీవెన, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్స్యకార భరోసా,జూన్ లో అమ్మఒడి పథకం అమలు చేస్తామని సీఎం జగన్ వివరించారు.జూలైలో విద్యా కానుక, వాహనమిత్ర , కాపు నేస్తం పథకాలను అమలు చేస్తామన్నారు. ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్ , నేతన్న నేస్తం అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

సెప్టెంబర్ లో వైఎస్ఆర్ చేయూతను అమలు చేస్తామన్నారు. అక్టోబర్ లో వసతి దీవెన, రైతు భరోసాను అమలు చేయనున్నట్టుగా సీఎం వివరించారు. నవంబర్ లో విద్యా దీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. డిసెంబర్ లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలను అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.జనవరిలో రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న  తోడు పథకాలను అమలు చేస్తామని సీఎం తెలిపారు. జనవరి మాసంలో పెన్షన్ ను రూ. 2500 నుండి రూ.2750కి పెంచనున్నారు.ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తారు. మార్చిలో వసతి దీవెనను అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన Budget ప్రజల బడ్జెట్ అని ఆయన చెప్పారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా కూడా  సంక్షేమ పథకాలను నిలిపివేయలేదన్నారు. మూడేళ్లుగా తమ ప్రభుత్వం 95 శాతం హామీలు నెరవేర్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.  అందరూ నా వాళ్లే అని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్ చెప్పారు. మూడేళ్లుగా తమ ప్రభుత్వం ఆచరణే తమ పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో కుల, మత ప్రాంతాలతో పాటు రాజకీయాలు కూడా చూడడం లేదన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి కూడా ఒక్క పథకం కూడా లేదని జగన్ ఎద్దేవా చేశారు. 

click me!