యాస్ తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

By narsimha lode  |  First Published May 25, 2021, 1:44 PM IST

యాస్ తుఫాన్ పై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 


అమరావతి: యాస్ తుఫాన్ పై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. యాస్ తుపాన్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు అధికారులతో సమీక్షించారు. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్ల జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు.యాస్ తుఫాన్ పై అధికారులు, కలెక్టర్లు, అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను  సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్ కు వివరించారు.

also read:యాస్ తుఫాను భీభత్సం ఖాయం... ఏపీ పరిస్థితి ఇదీ..: ఐఎండీ హెచ్చరిక

Latest Videos

కోవిడ్ రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు.  తుఫాన్ కారణంగా కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ ను ముందే నిల్వ ఉంచుకోవాలని సీఎం సూచించారు. అంతేకాదు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఉన్న రోగులను సురక్షిత ప్రాంతాలకు ముందే తరలించాలని సీఎం ఆదేశించారు.
 

click me!