పంటల ప్రణాళికపై సమీక్ష: రైతులు ప్రభుత్వ సూచనలు పాటించాలన్న జగన్

By Siva KodatiFirst Published Jun 1, 2020, 3:01 PM IST
Highlights

పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బేకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు.

పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బేకే పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు.

జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్‌చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారని.. ఇ– క్రాపింగ్‌ మీద గైడ్‌లైన్స్, ఎస్‌ఓపీలను వెంటనే తయారుచేయాలని జగన్ సూచించారు.

ఇ– క్రాపింగ్‌ విధివిధానాలను గ్రామ సచివాలయాల్లో, ఆర్బేకే కేంద్రాల్లో పెట్టాలన్న ముఖ్యమంత్రి.. ప్రభుత్వం 30శాతం పంటలను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. మిగతా 70శాతం పంటకూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని.. దీని కోసం ఈ- మార్కెటింగ్ ఫ్లాట్‌పాంను ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు, ఇ– మార్కెట్‌మీద పంటను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యమన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్‌ లాంటి ప్రయత్నాలు చేయకపోతే నాణ్యతా ప్రమాణాలను పాటించలేమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే కాలంలో జనతా బజార్లకూ ఈ విధానాలు దోహదపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు.
 

click me!