ఏపీ మంత్రి ఇంట్లో కరోనా కల్లోలం

By telugu news teamFirst Published Jun 1, 2020, 1:18 PM IST
Highlights

కోవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది. అయితే మేనత్త అంత్యక్రియల్లో.. మంత్రితో పాటు పలువురు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి శంకర్ నారాయణ ఇంట్లో కరోనా కలకలం చెలరేగింది. శంకర్ నారాయణ కుటుంబంలోని సభ్యులు కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. అయితే మంత్రికి మాత్రం కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు.

ఏపీ రాష్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మేనత్త అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆనంతరం కోవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్ అని తేలింది. అయితే మేనత్త అంత్యక్రియల్లో.. మంత్రితో పాటు పలువురు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దీంతో మంత్రి, కుటుంబ సభ్యులకు అధికారులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రిపోర్ట్స్‌లో మంత్రి శంకర్ నారాయణకు నెగిటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం మంత్రి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.

కాగా అటు ఏపీలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఆదివారం కొత్తగా 98 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3042కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలను సేకరించింది ఏపీ ప్రభుత్వం. 2092 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 70 కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్ కేసులున్నాయి.

click me!