గుంటూరు జిల్లాలోని తెనాలిలో రైతు భరోసా నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విడుదల చేశారు. రైతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేసిందని జగన్ చెప్పారు.
గుంటూరు:కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నాలుగో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కరువు కూడా వచ్చేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనే అన్యాయస్తుడు సీఎంగా ఉన్న సమయంలో కరువు విలయతాండవం చేసిందన్నారు.
undefined
గత నాలుగేళ్లుగా ఏనాడూ కరువు రాలేదన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని పలు రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయని సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు
రైతు భరోసాతో రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. పట్టా ఉన్న రైతుకే కాకుండా అసైన్డ్ భూముల రైతులకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులనుఅందిస్తున్నామని సీఎం గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా రూ. 27 వేల కోట్లను ఇప్పటికే అందించినట్టుగా సీఎం జగన్ వివరించారు.
ఆర్ బీ కే కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుండి ఎరువుల వరకు తోడుగా నిలుస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ఆర్ బీ కే కేంద్రాలు దేశంలోని పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిటిచినట్టుగా సీఎం జగన్ వివరించారు.
నాలుగేళ్లుగా ఆహర ధాన్యల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగిందని సీఎం జగన్ చెప్పారు. ధాన్యం సేకరణకు రూ. 55 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయన తెలిపారు.ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు నష్టపోతే అదే ఏడాది రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సిడీని అందిస్తున్న చరిత్ర తమ ప్రభుత్వానిదని సీఎం జగన్ చెప్పారు.
also read:రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేసి గెలుస్తారా?: చంద్రబాబు, పవన్ లకు జగన్ సవాల్
టీడీపీ పాలనలో ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ. 3.411 కోట్లు మాత్రమే చెల్లించిన విషయాన్ని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగేళ్లలో రైతులకు రూ. 6,695 కోట్లు అందించినట్టుగా సీఎం జగన్ వివరించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వ్యవసాయంపై ప్రేమంటే ఇలా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.