
అమరావతి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో రైతు భరోసా పథకంకింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ మంగళవారంనాడు విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు. ప్రజలకు ఎప్పుడూ కూడా మంచి చేసిన పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. అందుకే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ లకు రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం లేదన్నారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే గెలిచే ధైర్యముందా అనిచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి జగన్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు వివరించి మరోసారి అధికారంలోకి వస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తీరుతామనే నమ్మకం తనకు ఉందన్నారు.ఈ విషయంలో తనకు ఎలాంటి భయం లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ప్రజలకు మంచి చేశామని తాను నమ్ముతున్నట్టుగా చెప్పారు. అందుకే ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారనే విశ్వాసంతో ఉన్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హమీలను తమ పార్టీ అమలు చేసిందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరువయ్యాయో తెలుసుకునేందుకు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు గడప గడపకు తిరుగుతున్నారని సీఎం జగన్ చెప్పారు.
రానున్న రోజుల్లో ఇంకా అనేక కుట్రలు జరిగే అవకాశం ఉందన్నారు. మీకు మంచి జరిగిందని నమ్మితే తనకు అండగా నిలవాలని ప్రజలను కోరారు సీఎం జగన్. చంద్రబాబు పాలనకు తన పాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా చూడాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో కరువుతో ప్రెండ్ షిప్ ఉన్న చంద్రబాబుకు వరుణ దేవుడి ఆశీస్సులున్న వైసీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని చంద్రబాబుకు , నాడు నేడు పేరుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చుతున్న తమకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు, ఎల్లో మీడియా అండగా ఉందన్నారు. కానీ తనకు దేవుడి ఆశీస్సులు , ప్రజల అండ ఉందని సీఎం జగన్ వివరించారు.