రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది.. ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది.. ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.స్పందన కార్యక్రమంలో ఎస్పీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు ఆయన క్యాంప్ కార్యాలయం నుండి ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అర్ధరాత్రి అందరూ పడుకొన్నాక దేవాలయాలపై దాడులు జరగుతున్నాయన్నారు. దాడులు చేసిన వారే మళ్లీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
undefined
రాజకీయ లబ్దికోసం చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గుళ్లు, గోపురాలను రక్షించుకొనే కార్యక్రమాలను చేస్తున్నామని ఆయన చెప్పారు. జనసందోహాం లేని ప్రాంతాల్లోని ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని ఆయన చెప్పారు. సంక్షేమ ఫలాలను జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయడానికి ఎవరైనా భయపడేలా శిక్షలు ఉండాలని ఆయన కోరారు.