వైఎస్ఆర్ వర్ధంతి: ఇడుపులపాయలో నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు

By narsimha lodeFirst Published Sep 2, 2022, 9:22 AM IST
Highlights

కడప జిల్లాలోని  ఇడుపులపాయలో  వైఎస్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నివాళులర్పించారు. 

కడప: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని  కడప జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎఏస్ సమాధి వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు నివాళులర్పించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల తదితరులు  వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. వైఎస్ ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.ఈ ప్రార్ధనల తర్వాత వైఎస్ఆర్ సమాధి వద్ద సీఎం జగన్ సహా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైసీపీకి చెందిన  పలువురు ప్రజా ప్రతినిధులు కూడా వైఎస్ఆర్సమాధి వద్ద నివాళులర్పించారు. 

2009 సెప్టెంబర్ 2వ తేదిన అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణీస్తున్న హెలికాప్టర్  ప్రమాదానికి గురై వైఎస్ఆర్ మరణించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా ఎప్పటికీ ఆయన చిరునవ్వు నిలిచే  ఉన్నాయని జగన్ గుర్తు చేశారు.ప్రజల అవసరాలేూ పాలనకు ప్రధానాంశం కావాలని వైఎస్ఆర్ చాటి చెప్పారని సీఎం జగన్ గుర్తు చేశారు.వైఎస్ఆర్ స్పూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం జగన్ చెప్పారు.. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ ను గుర్తు చేసుకున్నారు. 

click me!