కృష్ణకు నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్:కుటుంబ సభ్యులకు ఓదార్పు

Published : Nov 16, 2022, 11:29 AM ISTUpdated : Nov 16, 2022, 12:23 PM IST
కృష్ణకు నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్:కుటుంబ సభ్యులకు ఓదార్పు

సారాంశం

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహంపై పూలమాల వేసి  ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పార్థీవదేహనికిఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారంనాడు నివాళులర్పించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి హైద్రాబాద్ కు  సీఎంజగన్ చేరకున్నారు.పద్బాలయ స్టూడియోకి చేరుకున్నారు.కృష్ణ పార్థీవదేహంపై పూలమాల వేసినివాళులర్పించారు. హీరో కృష్ణ కుటుంబ సభ్యులను  సీఎం జగన్ ఓదార్చారు.హీరో మహేష్ బాబును గుండెలకు హత్తుకుని సీఎం జగన్ ఓదార్చారు. కృష్ణ సోదరుడుఆదిశేషగిరిరావు కుటుంబసభ్యులను జగన్ కు  పరిచయం చేశారు.కృష్ణ మృతికి సంబంధించిన వివరాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.కృష్ణ కుటుంబసభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు.

alsoread:హీరో కృష్ణకు గవర్నర్ తమిళిసై నివాళులు: కుటుంబ సభ్యులకు ఓదార్పు

మంగళవారంనాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కృష్ణ మరణించాడు.కృష్ణ పార్థీవ దేహన్నినిన్న ఉదయమే  నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరించారు. ఇవాళ  ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ పార్థీవదేహన్నితరలించారు. అభిమానుల సందర్శనార్ధం స్టూడియోలో మధ్యాహ్నం వరకు ఉంచుతారు. 

నిన్న పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్థీదేహనికి నివాళులర్పించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ,ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుమాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు. గుండెపోటు రావడంతో కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ నిన్నతెల్లవారుజామున మృతి చెందాడు. హీరో మహేష్ బాబు కటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన కొద్ది రోజులకే తల్లి ఇందిరాదేవి మరణించింది.తల్లి మరణించిన రెండునెలల్లోపుగానే హీరో కృష్ణ మృతి చెందాడు.రమేష్ బాబు మరణానికి రెండేళ్ల ముందే  హీరో  కృష్ణ సతీమణి విజయనిర్మల కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.


 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?
కడప జిల్లా ఏం పాపం చేసుకుందో అర్థం కావడం లేదు 😡 Dr Br Ambedkar Gurukulam Sagileru, Kadapa District