కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఇవాళ జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు.పలువురు గాయపడ్డారు. ట్రాలీ,టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
గండేపల్లి:కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో బుధవారంనాడు ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని మల్లేపల్లి వద్ద ట్రాలీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొంది.దీంతో నలుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ వెళ్తున్న సమయంలో ఈప్రమాదం చోటు చేసుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుప్రమాదాల్లో పలువురు మరణిస్తున్నారు.అనేక మంది గాయపడుతున్నారు.డ్రైవర్లుఅజాగ్రత్తగావాహనాలునడపడంతోపాటు రోడ్లు సరిగా లేకపోవడం కూడాప్రమాదాలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. రోడ్డుప్రమాదాల నివారణకోసం ట్రాఫిక్ నిబంధలను పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా అధికారులు గుర్తించారు.అతివేగంతో పాటుడ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణంగా పోలీసులు గుర్తించారు.
undefined
ఈ నెల16న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు.ట్యాంకర్ ,కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నెల 14న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగినరోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది జూన్13 వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు.నారాయణఖేడ్ నుండి కామారెడ్డి జిల్లాకు బైక్ పై వెళ్తున్నసమయంలోప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది జూన్ 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుఅదుపు తప్పి చింతూరు మండలం ఏడురాళ్లపల్లివద్ద బోల్తాపడింది.ఈ ఘటనలో ప్రైవేట్ బస్సులోని ఐదుగురు మృతి చెందారు.పలువురు గాయపడ్డారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు..జనగామ జిల్లాలో ఈ ఏడాది జూన్ 5న జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద టవేరా వాహనం డివైడర్ ను ఢీకొట్టింది.దీంతో ఈ వాహనంలోని ముగ్గురు మృతి చెందారు.