
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (AP CM YS Jagan) ఆదేశించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,ఆదిమూలపు సురేష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. తక్షణమే చర్యలుతీసుకోవాలని హైపవర్ కమిటీని సీఎం జగన్ ఆదేశించారు.
ఇక, పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నేటి నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వం చర్చలను ఆహ్వానించింది. సాయంత్రం సచివాలయంలో చర్చలు జరిపేందుకు మున్సిపల్ కార్మికుల జేఏసీని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) ఆహ్వానించారు.