YS Jagan Mohan Reddy : మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సిద్ధమైన జగన్.. ఏకంగా 46 వేల ఎకరాల భూ పంపిణీ

By Siva Kodati  |  First Published Nov 16, 2023, 9:59 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ల్యాండ్ పర్చేజ్ స్కీం (ఎల్‌పీఎస్) కింద ఎస్సీ కార్పోరేషణ్ గతంలో పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వహక్కులు కల్పించడంతో పాటు వారి రుణాలను మాఫీ చేయనున్నారు. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూములపై సర్వ హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

జగన్ ప్రభుత్వం ఇప్పటికే 20,24,709 మంది పేదలకు 35,44,866 ఎకరాల్లో భూ పంపిణీ చేసింది. ఇప్పుడు తాజాగా భూముల అసైన్మెంట్ లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు.. ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీస్ ఇనామ్, ఎస్సీ కార్పోరేషన్ భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించే భూ యాజమాన్య హక్కు పత్రాలను జగన్ పంపిణీ చేయనున్నారు. 

Latest Videos

ఇప్పుడు కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములను పంపిణీ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్ లేదా లీజు పట్టాలు ఇవ్వనున్నారు. అలాగే అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తారు. దీనితో పాటు 1563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తోంది జగన్ సర్కార్. ల్యాండ్ పర్చేజ్ స్కీం (ఎల్‌పీఎస్) కింద ఎస్సీ కార్పోరేషణ్ గతంలో పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వహక్కులు కల్పించడంతో పాటు వారి రుణాలను మాఫీ చేయనున్నారు. 
 

click me!