
అమరావతి: విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రి మాతా శిశు సంక్షేమ విభాగంలో దారుణం చోటుచేసుకుంది. పురిటిలోనే నవ జాత శిశువు మరణించింది. దీంతో హాస్పిటల్‌లో కలకలం రేగింది. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో పసి బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు బైఠాయించారు. పసిబిడ్డ మృత దేహంతో తండ్రి అక్కడే బైఠాయించారు. దీంతో కొంత సేపు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాగా, వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని బదులు ఇస్తున్నారు. పసిబిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
నందిగామ నుంచి ప్రసవం కోసం ఆ కుటుంబం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించారు. మొత్తంగా డెలివరీ చేసినా.. శిశువు మాత్రం చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందని విరుచుకుపడ్డారు. అక్కడే బైఠాయించారు. పోలీసులు వచ్చినా అంత సులువుగా గొడవ సద్దుమణగలేదు. వైద్యులు తమను లోపలకు వెళ్లడానికి అనుమతించలేదని అన్నారు. వారి వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన.. మార్చురీలోని శవాన్ని పీక్కుతిన్న కుక్క..
తమ తప్పేమీ లేదని వైద్యులు చెప్పారు. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని వివరించారు. పోలీసులు కల్పించుకుని బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. కాగా, వైద్యులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపించారు. కనీసం పేషెంట్ దగ్గరకు వెళ్లనివ్వలేదని అన్నారు. ఒక్కరినీ ఆమె దగ్గరకు వెళ్లనివ్వలేదని తెలిపారు. వైద్యులపై తీవ్ర ఆరోపణలూ చేశారు. ఇక్కడ వైద్యులు పిల్లలను డెలివరీ చేసిన తర్వాత అమ్ముకుంటున్నారా? అంటూ ఆరోపణలు గుప్పించారు. పేషెంట్ దగ్గరకూ ఒక్కరినైనా ఎందుకు వెళ్లనివ్వలేదని అడిగారు. అసలు చనిపోయిందని తమకు ఇచ్చిన శిశువు తన భార్యకు జన్మించిన శిశువేనా? అని ప్రశ్నించారు. పుట్టిన వారిని చూడటానికైనా ఒక్కరినైనా ఎందుకు రానివ్వరు? అని ప్రశ్నలు వేశారు.
ఇటీవలే ఒడిశాలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్ప్రతి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్క పీక్కుతింది (Dog eats body). మార్చురీలో ప్రవేశించిన కుక్కు ఈ పనిచేసింది. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రిలో (Rourkela Government Hospital) ఆదివారం రోజున చోటుచేసుకుంది. వివరాలు.. గోపబంధుపల్లికి చెందిన రాజేష్ యాదవ్ (40) గురువారం మల్గోడం ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని మృతదేహాన్ని ఉదిత్‌నగర్ పోలీసులు (Uditnagar police) ఆర్‌జిహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచారు.
అయితే రాజేష్ బంధువులు మృతదేహాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు.. కుక్క పాక్షికంగా మృతదేహాన్ని తినేసినట్టుగా గుర్తించారు. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రాజేష్ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిని ముట్టడించి ఆరు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న రూర్కెలా తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చంద్రకాంత్ మల్లిక్ (Chandrakant Mallick) అక్కడి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రకాంత్ మల్లిక్ హామీ ఇవ్వడంతో రాజేష్ కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు. మరోవైపు ఆస్పత్రి యజమాన్యం కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.